నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా

by Ratna Kumari |

పెట్రోల్ బంకుల యజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కట్టిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా అన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా
X

దిశ, భూదాన్ పోచంపల్లి : పెట్రోల్ బంకుల యజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కట్టిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్, పట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం బంకులో జిల్లా సివిల్ సప్లై అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పెట్రోల్, డీజిల్ కొలతలలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తనిఖీ చేయడంతో పాటు మిషన్ రీడింగ్, డెన్సిటీ, డైలీ సేల్స్ రికార్డును పరిశీలించారు . అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి పెట్రోల్ బంక్ లో వినియోగరుల కోసం గాలి పంపు, టాయిలెట్లు, తాగునీటి వంటి సౌకర్యాలను ఉచితంగా కల్పించాలని సూచించారు. నాణ్యతలో, కొలతల్లో ఏవైనా మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంకు యజమాన్యాలను ఆదేశించారు. తనిఖీ చేసిన రెండు బంకుల్లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో బంకు యజమాన్యాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీటీ బాలమణి, అధికారులు ఉన్నారు.

Next Story