సమయపాలన పాటించకపోతే వీరిపై కఠిన చర్యలు : కలెక్టర్

by Naveena |

ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.

సమయపాలన పాటించకపోతే వీరిపై కఠిన చర్యలు : కలెక్టర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వసతులు ఎలా ఉన్నాయని పెషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రెవేట్ హాస్పిటల్ కి వెళ్లొద్దని సూచించారు. ఓపికి ఎంత మంది వచ్చారని అడిగితే 60 మంది వచ్చారని డాక్టర్ తెలిపారు.

Next Story