- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ ఉత్సవాల్లో విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు
: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య, పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

దిశ, సూర్యాపేట: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య, పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సూచించారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అత్యధిక సార్లు మద్యం సేవించి పట్టుబడిన వారిని శుక్రవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిపించి సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి మద్యం మత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తెలిపారు. ఇతరులను రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, పాటలు, వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు అత్యధిక సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 32 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు.






