- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > లక్కీడ్రా ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు : ఇన్ స్పెక్టర్ మన్మథ కుమార్
లక్కీడ్రా ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు : ఇన్ స్పెక్టర్ మన్మథ కుమార్
దిశ, చౌటుప్పల్ టౌన్ : స్థిరాస్తుల అమ్మకాల కోసం ఇటీవల కాలంలో లక్కీడ్రా లు, లాటరీల పేరుతో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని మోసం

X
దిశ, చౌటుప్పల్ టౌన్ : స్థిరాస్తుల అమ్మకాల కోసం ఇటీవల కాలంలో లక్కీడ్రా లు, లాటరీల పేరుతో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని మోసం చేయాలని చూసే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ జి. మన్మథకుమార్ హెచ్చరించారు. రూ.500లు, రూ.1000లకే ప్లాటు, ఇల్లు, బైకు, కారు గెలుచుకునే గొప్ప అవకాశం అంటూ లక్కీ డ్రా ల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ఆశ చూపిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని ఉపేక్షించేది లేదంటూ తెలిపారు. లాటరీలు, లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై ఎవరు ఫిర్యాదు చేసినా తక్షణమే కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






