వీధి కుక్కల దాడి.. పలువురికి ఏమైందో మీరే చూడండి!

by Naveena |

వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు.

వీధి కుక్కల దాడి.. పలువురికి ఏమైందో మీరే చూడండి!
X

దిశ, భూదాన్ పోచంపల్లి: వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా .. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.

Next Story