అల్లిపురంలో కుక్కల కలకలం..పనిలో ఉన్న మహిళలపై దాడి

by Bhanu |

మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో బుధవారం ఉదయం పిచ్చికుక్కల దాడితో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలపై ఒక్కసారిగా పిచ్చికుక్కలు విరుచుకుపడ్డాయి.

అల్లిపురంలో కుక్కల కలకలం..పనిలో ఉన్న మహిళలపై దాడి
X

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో బుధవారం ఉదయం పిచ్చికుక్కల దాడితో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలపై ఒక్కసారిగా పిచ్చికుక్కలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సహచర కూలీలు హుటాహుటిన హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఇతరులపై దాడికి యత్నించగా, గ్రామస్థులు,ఆ కుక్కను తరిమికొట్టారు. కుక్కలు దాడి చేస్తుండటంతో గ్రామస్థులు పిల్లలను, పెద్దలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. కుక్కల దాడిని నిర్మూలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..



Next Story