ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపోల్‌కు అడుగులు

by Malleboina Mahesh |

*ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు మొదలు.. *వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాకు షెడ్యూల్.. *జనవరి రెండో వారంలో ఓటర్ల తుది జాబితా విడుదల..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపోల్‌కు అడుగులు
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలలో ఉన్న వివరాలను, ఎస్సీ ఎస్టీ జనాభాను ప్రకటించింది. దాంతోపాటు ఓటరు జాబితా పోలీస్ స్టేషన్ల జాబితా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో గత రెండు రోజుల క్రితం నుంచి షెడ్యూల్ మొదలు పెట్టింది డిసెంబర్ 30 నుంచి జనవరి 9 వరకు ఓటరు జాబితా వివరాలు పోలింగ్ చేసిన వివరాలు రాజకీయ పక్షాలతో సమావేశాలు పూర్తి చేసి జనవరి 10 న తుది ఓటర్ జాబితా ప్రకటించాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులను ఆదేశించింది.

ఇది షెడ్యూల్..

డిసెంబర్ 30 న మున్సిపాలిటీ వివరాలు సరిచూసుకోవాలి. డిసెంబర్ 31న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి . జనవరి 1న పోలింగ్ కేంద్రాలు ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించాలి . జనవరి5 న మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం . జనవరి 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం . జనవరి 10న పోలింగ్ బూతుల వారిగా ఫైనల్ ఓటర్ జాబితా ప్రకటించాలని ఆదేశాలు జారీచేశారు.

ఉమ్మడి జిల్లాలో 407 వార్డులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే అందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య, జనాభా, ఎస్సీ, ఎస్టీ జనాభాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 18 మున్సిపాలిటీలలో 407 మున్సిపల్ కౌన్సిల్ వార్డులు ఉన్నాయి. మున్సిపల్ పట్టణాల్లో జనాభా 8,31,834 మంది ప్రజలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో గిరిజనులు 44040, దళితులు 1,13,744 మంది ఉన్నారు.

నల్గొండ జిల్లా మున్సిపాలిటీలో

నల్లగొండ ..

వార్డులు ...48

జనాభా....1,90,261

ఎస్టీ ‌......2812

ఎస్సీ....31,821

చండూరు

వార్డు లు....12

జనాభా..‌..12889

ఎస్టీ...144

ఎస్సీ...1237

చిట్యాల..

వార్డు లు....12

జనాభా...14986

ఎస్టీ.....212

ఎస్సీ...2642

దేవరకొండ

వార్డు లు....20

జనాభా...29731

ఎస్టీ..... 3720

ఎస్సీ....2894

హాలియా

వార్డులకు...12

జనాభా...17371

ఎస్టీ....860

ఎస్సీ..2193

మిర్యాలగూడ

వార్డులు....48

జనాభా..109891

ఎస్టి....6069

ఎస్సీ....15637

నందికొండ

వార్డులు... 12

జనాభా...15887

ఎస్టి....1003

ఎస్సీ....3086

సూర్యాపేట జిల్లా...

హుజూర్నగర్..

వార్డులు-28

జనాభా-35850

ఎస్టి-537

ఎస్సీ-4219

కోదాడ..

వార్డులు- 35

జనాభా-75093

ఎస్టి-4185

ఎస్సీ-10556

నేరేడుచర్ల

వార్డులు -15

జనాభా-14,853

ఎస్టీ-394

ఎస్సీ- 3183

సూర్యాపేట

వార్డులు... 48

జనాభా- 1,33,399

ఎస్టా-29,393

ఎస్సీ-10,471

తిరుమలగిరి

వార్డులు...‌15

జనాభా....18474

ఎస్టి.....1607

ఎస్సీ...3671

యాదాద్రి భువనగిరి జిల్లా

ఆలేరు

వార్డులు..12

జనాభా..17120

ఎస్టి......122

ఎస్సీ..,..2616

భువనగిరి..

వార్డులు....35

జనాభా...66256

ఎస్టి.,.....903

ఎస్సీ...8597

చౌటుప్పల్

వార్డులు.....20

జనాభా 31202

ఎస్టి....553

ఎస్సీ......4471

మోత్కూర్..

వార్డులు....12

జనాభా....15924

ఎస్టి.....117

ఎస్సీ.....2973

పోచంపల్లి

వార్డులు.....13

జనాభా..17010

ఎస్టీ..... 196

ఎస్సీ....1947

యాదగిరిగుట్ట

వార్డులు....12

జనాభా....15637

ఎస్టి.....213

ఎస్సీ.....22494

కార్పొరేషన్ కానట్లే..!!

సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీగా కొనసాగుతున్న నల్లగొండలో కార్పొరేషన్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావించారు. మేరకు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మార్చాలని ప్రతిపాదనను ప్రభుత్వానికి సుమారు మూడు నెలల క్రితం పంపించారు. కానీ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మార్పు చెందే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు మున్సిపల్ ఎన్నిక నిర్వహించాల్సిన కేంద్రాల్లో ఓటరు జాబితా పోలింగ్ స్టేషన్‌లో తదితర ఏర్పాట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా ఇక నలగొండ మున్సిపాలిటీ గాని మిగిలిపోనుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఉన్న 48 వార్డులకు మరో రెండు వార్డులు పెంచుతూ 50 వార్డులుగా చేస్తే కార్పొరేషన్ గా మార్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.

Next Story