- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: పరిశీలకులు రవి నాయక్
by Bhanu |
మొదటి విడత రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రీ పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు, నిర్వహణ పద్ధతులు, సిబ్బంది విన్యాసంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

X
దిశ, తిరుమలగిరి: మొదటి విడత రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రీ పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు, నిర్వహణ పద్ధతులు, సిబ్బంది విన్యాసంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలను జరిపించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్, తహశీల్దార్ హరిప్రసాద్, జోనల్ అధికారులు శాంతయ్య, అశోక్, మహేష్, మాస్టర్ ట్రైనర్లు అశోక్ రెడ్డి, పి సైదులు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






