పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవండి : మంత్రి సీతక్క

by Ratna Kumari |

ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవండి :  మంత్రి సీతక్క
X

దిశ, మోత్కూరు : ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మోత్కూరు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచార సభలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ పదవులుగా అధికారంలో ఉన్న బారాస దోచుకున్నది పంచుకోవడానికి తలోదారి వెతుక్కుంటూ పగలు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం గృహజ్యోతి ఉచిత బస్సు తదితర సౌకర్యాలను కల్పిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందని పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళా సంఘాలలో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉంటే ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 400 మంది సభ్యులు చనిపోతే 40 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తను ఈ ప్రాంత వాసినా అని మోత్కూరు పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నానని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిషోర్ ఇసుక దోపిడీ, భూమాఫీయకు పాల్పడ్డాడని అతని మాటలు నమ్మి ప్రజలు మోసపోయి అభివృద్ధికి విగాతం కలిగించుకోవద్దని విజ్ఞప్తి చేశారు సభకు ముందు స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్కతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పైల సోమిరెడ్డి డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి అలిశెట్టి ఆవిలిమల్లు సిపిఐ నాయకులు చేడే చంద్రయ్య ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Next Story