దిశ ఎఫెక్ట్: చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం

by Bhanu |

ఎవరికి ఏమైపోతే మనకేంటి అనుకునే ఈ రోజుల్లో ఎస్ఎస్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.

దిశ ఎఫెక్ట్: చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఎవరికి ఏమైపోతే మనకేంటి అనుకునే ఈ రోజుల్లో ఎస్ఎస్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన చేరాల హిందుజ లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది .వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లి గవ్వలేక ఆ కుటుంబం అల్లాడిపోతుంది. దీంతో పేద కుటుంబానికి పెద్ద కష్టం అనే కథనం ఈ నెల 19న దిశ దినపత్రికలో ప్రచురితమైంది.

వెంటనే స్థానిక ఎస్ ఎస్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు స్పందించి మానవతా దృక్పథంతో 66,570 రూపాయలను సేకరించి చికిత్స పొందుతున్న హిందూజ కుటుంబానికి సోమవారం అందజేశారు. హిందుజ ప్రాణాలు కాపాడటంలో తన వంతు పాత్రను పోషించిన దిశ దినపత్రికకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, క్రాంతి, లింగస్వామి, వేముల సుమన్ గౌడ్, చేరాల కిరణ్ ,చేరాల విక్రం తదితరులు ఉన్నారు.

Next Story