కరుణించిన "శ్రీరాం" సాగర్

by velandi.Saikiran |

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సూర్యాపేట జిల్లా రైతాంగానికి "శ్రీరాం" సాగర్ రెండో దశ కరుణించింది. ఈ మేరకు

కరుణించిన శ్రీరాం సాగర్
X

దిశ, తుంగతుర్తి: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సూర్యాపేట జిల్లా రైతాంగానికి "శ్రీరాం" సాగర్ రెండో దశ కరుణించింది. ఈ మేరకు ఈనెల 8న ఉదయం 11 గంటలకు నీటి విడుదలకు ముహూర్తం కుదిరింది.జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ చేతుల మీదుగా గేట్లను ఎత్తి నీటి విడుదల చేయడానికి తిరుమలగిరి డివిజన్ నీటిపారుదల శాఖ ఆదివారం ప్రణాళిక తయారు చేసింది.అంతేకాకుండా ఆ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక పంపింది.అయితే నీటి విడుదల అనేది వారబందీ పద్ధతిలో కొనసాగుతుందా..? లేక ప్రతిరోజు జరుగుతుందా..? అనే అంశాన్ని మాత్రం ఆ శాఖ నిర్ణయించలేదు.ప్రస్తుతానికి మాత్రం ఒక వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాకు ప్రతిరోజు విడుదల చేయాలని ఆ శాఖ సూత్రప్రయంగా నిర్ణయం తీసుకుంది.ఈ లోగానైనా లేదా వారం రోజుల అనంతరం దీనిపై ఒక షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.

మైలారం నుండి బయన్నవాగులోకి నీటి విడుదల

కాకతీయ కాలువ నుండి వస్తున్న నీటితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆదివారం ఉదయానికి కొంతవరకు నిండిపోయింది.దీంతో అక్కడి అధికారులు గేట్లను ఆదివారం మధ్యాహ్నం ఎత్తి బయన్నవారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వైపు వదిలారు. అయితే సోమవారం ఉదయం నాటికి బయన్నవాగుకు భారీగానే నీళ్లు చేరుతాయని తిరుమలగిరి డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేయాలని భావించి ఈనెల 8 కి ముహూర్తం పెట్టారు.సూర్యాపేట జిల్లాకు తొలుత 500 క్యూసెక్కులు విడుదల చేసి తదనంతరం దీని సామర్ధ్యాన్ని క్రమక్రమంగా పెంచుతామని ఆ శాఖ ఈఈ సత్యనారాయణ “దిశ”కు తెలిపారు.

Next Story