- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసుల కక్కుర్తి!
యాదగిరి గుట్ట మండలం మాసాయి పేట గ్రామ రెవిన్యూ శివారులోని సర్వే నెంబర్లు 726,776 లలో మొత్తం 91.18 ఎకరాలలో రూల్స్ బ్రేక్

దిశ, ఆలేరు: యాదగిరి గుట్ట మండలం మాసాయి పేట గ్రామ రెవిన్యూ శివారులోని సర్వే నెంబర్లు 726,776 లలో మొత్తం 91.18 ఎకరాలలో రూల్స్ బ్రేక్ చేశారు. అక్రమంగా బఫర్ జోన్,ఎఫ్ టి ఎల్, భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సుంకోజు మధుమోహన్, సుంకోజు సురేష్, సుంకోజు సుజన్, సుంకోజు కృష్ణ సాయి, డి జంగం అనే వ్యాపారులు చేసిన వెంచర్ లోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడంతో వేలాదిమంది అమాయక ప్రజలు రోడ్డున పడ్డారు. తమ సొంత ఇంటి కల నిజం చేసుకునేందుకు, పిల్లల భవిష్యత్తు, పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం ఎన్నో కలలుగని తాము కొనుగోలు చేసిన ప్లాట్ల వల్ల ప్రస్తుతం తమకు ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించిన అమాయక ప్రజలు చేసేది ఏమిలేక వెంచర్ యాజమాన్యంపై తిట్లు,శాపనార్ధనాలు పెట్టి సరిపెట్టుకుంటున్నారు.
ప్లాట్ కు రూ 1500 నుంచి రూ 2000 వసూళ్లు
మసాయి పేట రెవిన్యూ శివారులోని సర్వే నెంబర్లు 726,776 లలో మొత్తం 91.18 ఎకరాలలో ధరణిలోని లొసుగులను వాడుకున్నారు. ఈ తరుణంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులే సలహాలు ఇస్తూ ఒక్కొక్క ప్లాట్ కు రూ 1500 నుంచి రూ 2000 చొప్పున రియల్ వ్యాపారుల వద్ద వసుళ్ళకు పాల్పడ్డారు. ప్లాట్లు కొనుగోలు చేసే ఒక్కొక్క వినియోగదారుడు లక్షలాది రూపాయలు నష్టపోయేలా సబ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరోక్షంగా కారణమయ్యారు.
ఎల్ ఆర్ఎస్ కు నోచుకోని ప్లాట్లు!!
డీటీసీపీ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించిన వాటికీ ప్రభుత్వం 2020 లో ఎల్ ఆర్ ఎస్ ప్రవేశపెట్టి క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించింది. దీంతో మాసాయిపేట గ్రామ రెవెన్యూ శివారులోని పలుగోని చెరువు ప్రక్కనే గల సర్వేనెంబర్లు 726,776 లలో ఎలాంటి డీటీసీపీ అనుమతులు లేకుండా చేసిన వెంచర్ లో కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులకు ఆశలు చిగురించాయి. దీంతో అప్పట్లో ఎల్,ఆర్,ఎస్ కింద మీసేవ కార్యాలయంలో దరఖాస్తు రుసుమును చెల్లించి వేలాది మంది ప్లాట్ల కొనుగోలుదారులు ఎల్ ఆర్ ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులతో దరఖాస్తులను క్రమబద్ధీకరించే సమయంలో దరఖాస్తులును పరిశీలించిన పంచాయతీ అధికారులు ప్లాట్లు కొనుగోలు చేసిన సర్వే నెంబర్లు 726,776 ఎఫ్,టి ఎల్,బఫర్ జోన్ లో పరిధిలో ఉండడంతో దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో ప్లాట్ కొనుగోలు చేసిన యజమానులు దిక్కు తోచని స్థితిలో సతమతం అవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ఫామ్ ల్యాండ్ లోని ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేసి అమాయక ప్రజలు మోసపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






