- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థునిలతో బియ్యం బ్యాగులను మోపిస్తున్న వార్డెన్
దిశ, ఎం తుర్కపల్లి: పుస్తకాలు మొయ్యవలసిన చేతులతో బియ్యం బ్యాగులు మోపించిన....Special Story of Turkapally KGBV Hostel

X
దిశ, ఎం తుర్కపల్లి: పుస్తకాలు మొయ్యవలసిన చేతులతో బియ్యం బ్యాగులు మోపించిన దారుణమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాంపూర్ గ్రామంలో గల కస్తూరిబా బాలికల హాస్టల్లో శనివారం బియ్యం లోడు రాగా, ఆ బియ్యం బ్యాగులను హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు విద్యార్థినిలతో మోపించడం జరిగింది. చదువుకునే పిల్లలతో బియ్యం బ్యాగులు మోపియ్యడం ఏంటని ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. వెంటనే ఈ సంఘటనపై సంబంధిత అధికారులు స్పందించి వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






