పంచాంగ శ్ర‌వ‌ణానికి విశేష స్పంద‌న

by Ratna Kumari |   (  Updated:2026-03-19 12:13:36  IST  )

మండ‌ల ప‌రిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్వ‌హించిన పంచాంగ శ్ర‌వ‌ణానికి విశేష స్పంద‌న ల‌భించింది.

పంచాంగ శ్ర‌వ‌ణానికి విశేష స్పంద‌న
X

దిశ‌, నేరేడుగొమ్ము : నేరేడుగొమ్ము మండ‌లం తిమ్మాపురం గ్రామంలో కోదండ‌రామాంజ‌నేయ స్వామి ఆల‌యంలో ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని పంచాంగ శ్ర‌వ‌ణం ఘ‌నంగా నిర్వ‌హించారు. గ్రామంలోని పెద్ద‌లు, మ‌హిళ‌లు, యువ‌కులు భ‌క్తులు అధిక సంఖ్య‌లో హాజ‌రయ్యారు. ఆల‌య ప్రాంగ‌ణం అంతా కిక్కిరిసి పండుగ శోభ‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ పండితుడు చంద్ర‌శేఖ‌ర్ శ‌ర్మ పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించి గ్రామ‌స్తుల‌కు వారి పేర్ల ఆధారంగా రాశిఫ‌లితాల‌ను వివ‌రించారు. ప‌రాభ‌వ‌నామ సంవ‌త్స‌రంలో క‌లుగ‌బోయే శుభ ఫ‌లితాలు, వ్య‌వ‌సాయ ప‌రిస్థితులు, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, విద్యా అవ‌కాశాలు, ఉపాధి అవ‌కాశాలు వంటి వాటిపై స‌మ‌గ్రంగా విశ్లేషణ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ ప్ర‌ముఖులు, మ‌హిళ‌లు, యువ‌త పాల్గొన్నారు.

Next Story