- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ బి. చంద్రశేఖర్
వేసవిలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : వేసవిలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా పశువులు, వీధి కుక్కలు, పక్షులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయని అందువల్ల మూగ జంతువులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. పట్టణాల్లో వీధి జంతువులు, పశువులు దాహంతో ఇబ్బంది పడకుండా నీటి కుండలు ఏర్పాటు చేయాలని, వాటిని నిత్యం నింపే బాధ్యత మున్సిపాలిటీలు, తీసుకోవాలని చెప్పారు. గ్రామస్థాయిలలో జంతువులకు ఏర్పాటు చేసిన తొట్లను శుభ్రంపరిచి వాటిలో నీటిని నింపాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. దీనిపై అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని పెట్ డాగ్ దత్తత స్వీకరించిన విధంగానే ఆవులను దత్తత తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. జంతువులకు వైద్య పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని అన్నారు. అలాగే పశువుల కోసం చెట్ల నీడలో, తాత్కాలిక షెడ్ల రూపంలో నీడ ఆశ్రయాలు కల్పించాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు. వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని, అవసరమైన మందులు, మొబైల్ వెటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి పశువులకు నీరు, ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు. జంతువులపై హింస, నిర్లక్ష్యం జరుగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జంతు సంక్షేమం మానవీయ విలువలకు ప్రతీక అని పేర్కొంటూ, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు మల్టీపర్పస్ ఎండోస్కోప్ టూల్ కిట్ ను అందజేశారు. ఏఎస్పి రమేష్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, డిటిఓ లావణ్య, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి ఉన్నారు.






