ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిర్యాలగూడ : ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పని చేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
X

దిశ, మిర్యాలగూడ : ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పని చేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ సమీపంలోని నార్కట్పల్లి అద్దంకి రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లను ఆర్&బి శాఖ, ఎక్సైజ్, ఆర్టీవో, హైవే ఇంజనీర్ అధికారులు తో పాటు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల తో కలిసి పరిశీలించారు. మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలోని నందిపాడు ఎక్స్ రోడ్డు, వన్ టౌన్ పరిధిలోని ఈదులగూడ ఎక్స్ రోడ్డు, మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరు ఎక్స్ రోడ్డు, దామరచర్ల వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు నందిపాడు, ఈదులగూడ ఎక్స్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచికలు రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు ఎక్స్ రోడ్డు వద్ద అదిక ప్రమాదాలు జరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్ మూసివేసి మిర్యాలగూడ, వాడపల్లి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేయాలనీ అలాగే పాదాచారులకు అటు ఇటు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగకుండా మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ని అమర్చాలని అన్నారు.


దామరచర్ల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు, కార్మికులు వాహనదారులు రోడ్డు దాటే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున మధ్యలో మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్ లు గతంలో 58 ఉండగా ప్రస్తుతం 41 కి తగ్గించడం జరిగిందని, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నమని అన్నారు. రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరుస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాల పైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని కోరారు. శీతాకాలం ఉదయం మరియు రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ సమయంలో ప్రమాదాలు నివారించేందుకు అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనదారులకు పలు రకాల సూచనలు చేశారు.ఆయన వెంట డిఎస్పి రాజశేఖర రాజు, సి.ఐలు పి.యన్.డి ప్రసాద్, నాగభూషణ్ రావు, యస్.ఐలు రాంబాబు, శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, డి.టి.ఆర్ పి రిటైర్ సీఐ అంజయ్య, రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు.

Next Story