పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

by Bhanu |

పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న జాజిరెడ్డిగూడెం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన తిమ్మాపురం, అడివెంల, కుంచమర్తి, జాజిరెడ్డిగూడెం గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న జాజిరెడ్డిగూడెం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన తిమ్మాపురం, అడివెంల, కుంచమర్తి, జాజిరెడ్డిగూడెం గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి విధుల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రికి, ఎన్నికల అధికారులకు పటిష్ట భద్రత కల్పించాలని, ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించాలని, ఆంక్షలను పట్టిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ అశోక్, సీఐలు నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు ఈట సైదులు,బైరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story