- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు హత్య.. తండ్రి ఆత్మహత్య?
by Kodari Anjali |
కొడుకును హత్య చేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది.

X
దిశ, నల్లగొండ క్రైం: కొడుకును హత్య చేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అనుమానాస్పద దారుణ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన పబ్బతి రెడ్డి లింగారెడ్డి (44) విద్యుత్ శాఖలో పనిచేస్తూ, దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇతడి భార్య హైదరాబాద్ లో ఉన్న తనకు కుమారుడిని చూడటానికి ఉదయం వెళ్లింది. భార్య వచ్చి చూసే సరికి ప్రణీత్ రెడ్డి రక్తం మడుగులో, లింగారెడ్డి పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నారు. స్థానికుల సహాయంతో వెంటనే పోలీసులకు సమచారం అందించగా, సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. కుమారుడిని సుత్తితో కొట్టి హతమార్చి, తాను విషం తాగాడు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనేది తెలియాల్సి ఉంది.
Next Story






