- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి పై విచక్షణారహితంగా దాడి చేసిన కొడుకు.. పరిస్థితి విషమం
మండలంలోని కుదబక్షపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

దిశ, మర్రిగూడ: మండలంలోని కుదబక్షపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుమారుడు తన తల్లి పై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కడారి అబ్బమ్మ భర్త దాదాపు పది సంవత్సరాల క్రితం మరణించారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు యాదయ్యకు అదే గ్రామానికి చెందిన అలివేలుతో వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా భార్య అతని వద్దకు రాకపోవడంతో యాదయ్య మానసికంగా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. భార్య రాకపోవడం కారణంగా యాదయ్యలో అనుమానాలు పెరిగి, తనను ఎవరైనా హాని చేస్తారని భయంతో తల్లితో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మానసిక స్థితి కోల్పోయిన యాదయ్య, మంగళవారం తల్లి అబ్బమ్మపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిసింది. దాడి విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న అబ్బమ్మను మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక యాదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






