తల్లిని హత్యచేసిన కొడుకుకి జీవిత ఖైదు

by Bhanu |

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం బాలాజీ నగర్ తండాలో 2020 సంవత్సరంలో మెగావత్ బుజ్జినీ ఆమె కొడుకు మెగావాత్ మున్న తన తల్లిని అతిదారుణంగా రోకలిబండతో తలపై బలంగా దాడిచేసి హత్య చేశాడు.

తల్లిని హత్యచేసిన కొడుకుకి జీవిత ఖైదు
X

దిశ, పెద్దఅడిశర్లపల్లి : నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం బాలాజీ నగర్ తండాలో 2020 సంవత్సరంలో మెగావత్ బుజ్జినీ ఆమె కొడుకు మెగావాత్ మున్న తన తల్లిని అతిదారుణంగా రోకలిబండతో తలపై బలంగా దాడిచేసి హత్య చేశాడు. దీంతో మొన్నపై హత్యకేసు నమోదు కావడం జరిగింది. విచారణ జరిపి పోలీసులు సరియైన సాక్షాదారాలతో చార్జిషీట్ దాఖలు దాఖలు చేశారు. జిల్లా సెషన్స్ కోర్ట్ నల్లగొండలో వాదోపవాదాలు జరిగిన అనంతరం న్యాయమూర్తి ఎం నాగరాజు ముద్దాయి మున్నాపై నేరం రుజువు కావడంవల్ల జీవిత ఖైదు, వెయ్యి రూపాయలు జరిమాన విధించడం జరిగింది. ఈ కేసులో సాక్షులను కోర్టులో హాజరు పరిచి సకాలంలో ట్రయల్ జరిగే విధంగా చొరవ తీసుకున్నందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాణి గుడిపల్లి ఎస్సై డి నరసింహులు, కోర్టు ఆఫీసర్ నగేష్లను దేవరకొండ సబ్ డివిజనల్ ఐపీఎస్ మోనికను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ అభినందించారు.

Next Story