ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ..

by Naveena |

ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.

ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. 2024-25 పంట సంవత్సరంలో సన్నరకం ధాన్యం క్వింటాలు ఒక్కింటికి కనీస మద్దతు ధరకు అదనంగా రూ.500/- చొప్పున బోనస్ చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఏప్రిల్ 2025 నుండి రేషన్ షాపులలో ఖచ్చితంగా సన్నబియ్యం మాత్రమే పంపిణీ చేయుటకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబందించి జిల్లాలో 2,03,193 ఆహార భద్రత కార్డులు ఉండగా వాటిలో 6,37,964 లబ్దిదారులు, 13,711 అంత్యోదయ ఆహార భద్రత కార్డులు ఉండగా, వాటిలో 38,224 లబ్దిదారులు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 2,16,904 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 6,76,188 లబ్దిదారులు ఉన్నారని, అందుకు గాను ఏప్రిల్ పంపిణీ నిమిత్తం 100% సన్నబియ్యం కేటాయింపు అనగా 4307.669 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేయటం జరిగినట్లు పేర్కొన్నారు.

Next Story