కాలువ గండ్లకు రిపేరు చేయరా..?.. కప్పలకుంట రైతుల తిప్పలు

by Bhanu |

వర్షాకాలం ప్రారంభమైనా, మేళ్లచెరువు మండలంలోని పంటకాలువల మరమ్మతులపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కప్పలకుంట

కాలువ గండ్లకు రిపేరు చేయరా..?.. కప్పలకుంట రైతుల తిప్పలు
X

దిశ, మేళ్లచెరువు: వర్షాకాలం ప్రారంభమైనా, మేళ్లచెరువు మండలంలోని పంటకాలువల మరమ్మతులపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కప్పలకుంట తండా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎన్‌ఎస్‌సి మేజర్ కాలువ నుంచి రామాపురం మార్గంగా వస్తున్న కాలువలోని రెండు అడుగుల వెడల్పున నెర్రెలు ఏర్పడి సాగునీరు వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కాలువ ద్వారా కప్పలకుంట తండాకు నీరు చేరాల్సి ఉంది. అయితే కాలువలో ఏర్పడిన నెర్రెలు వల్ల గత సంవత్సరం చివరి దశలో పంటలకు తగిన నీరు అందక సుమారు 150 ఎకరాల భూమిలో సాగు నష్టపోయినట్లు రైతులు తెలిపారు. గతంలో ప్రభుత్వ చర్యలు లేకపోవడంతో తండా రైతులు స్వయంగా నెర్రెలపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయినా, ఇది చురుకైన పరిష్కారం కాలేదు.

రైతులు ఎన్నిసార్లు అధికారులకు వినతులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువను మంజూరు చేసి మరమ్మత్తులు చేపడితేనే రైతులు పంటలు వేసే అవకాశాన్ని కోల్పోకుండా కాపాడుకోవచ్చని కోరుతున్నారు.


Next Story