ఎందుకింత నిర్లక్ష్యం ..? ఇరిగేషన్ అధికారి లేఖ పై మౌనం

by Ajay Maddhiboyina |

భూముల ఆక్రమాలకు సంబంధించిన సమాచారం రెవెన్యూ శాఖ అధీనంలో ఉంటాయి. అలాంటిది ఆక్రమలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన శాఖ నిమ్మకు నిరేత్తినట్లుగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.

ఎందుకింత నిర్లక్ష్యం ..? ఇరిగేషన్ అధికారి లేఖ పై మౌనం
X

భూముల ఆక్రమాలకు సంబంధించిన సమాచారం రెవెన్యూ శాఖ అధీనంలో ఉంటాయి. అలాంటిది ఆక్రమలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన శాఖ నిమ్మకు నిరేత్తినట్లుగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని తాళ్లగడ్ధ , నార్కట్ పల్లి అద్దంకి రహదారి , రవీంద్రనగర్ ,తదితర ప్రాంతాల లో ప్రభుత్వ భూములు , కాల్వలు , నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి .అయిన తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఇతర శాఖలకు నెడుతున్నారని విమర్శలు ఉన్నాయి.-దిశ , మిర్యాలగూడ టౌన్

దిశ , మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలో జరుగుతున్న ఆక్రమణలపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువైన భూములను కబ్జాలు చేస్తున్న అక్రమార్కులు విక్రయాలు చేస్తున్నారు .కబ్జాలపై ఫిర్యాదులు అందిన పట్టిపట్టనట్లుగా వదిలేస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇరిగేషన్ అధికారులు పంపిన లేఖ కు నేటికీ సమాధానం లేకపోవడమేన నే ఆరోపణలు వస్తున్నాయి.

స్పందించని రెవెన్యూ శాఖ.. భూముల ఆక్రమాలకు సంబంధించిన సమాచారం రెవెన్యూ శాఖ అధీనంలో ఉంటాయి. అలాంటిది ఆక్రమలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన శాఖ నిమ్మకు నిరేత్తినట్లుగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.మిర్యాలగూడ పట్టణ పరిధిలోని తాళ్లగడ్ధ , నార్కట్ పల్లి అద్దంకి రహదారి , రవీంద్రనగర్ ,తదితర ప్రాంతాల లో ప్రభుత్వ భూములు , కాల్వలు , నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి .అయిన తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఇతర శాఖలకు నెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. గతంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తాళ్లగడ్డ ఆక్రమణలపై స్పందించి బోర్డులు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించి నిర్మాణాలు చేస్తున్నారు.అయిన ఆ విలువైన భూముల విషయంలో చర్యలు లేకపోవడం వలన రెవెన్యూ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నరంటే ఆక్రమణదారుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనివలనే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

శాఖల మధ్య సమన్వయ లోపం..

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ ,మున్సిపల్ , ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతోంది. తాళ్లగడ్డలో మల్లేపూల తోట , చెరువు శిఖం భూముల ఆక్రమణల వ్యవహరంలో ఎవరీకి వారు యామునా తీరే అన్న చందంగా మారింది..ఆక్రమిత భూముల పై రెవెన్యూ అధికారులను సమాచారం అడిగితే మున్సిపాలిటీఅని మన్సిపాలిటీ అధికారులను అడిగితే రెవెన్యూ ,ఇరిగేషన్ అని ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. సాదా కాగితాలపై ప్రభుత్వ భూమిని కొందరు రియల్ వ్యాపారులు విక్రయిస్తే నిర్మాణాలు అయ్యాక విద్యత్ కనెక్షన్ లు , ఇంటి నెంబర్లు ఇస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.దీని వలన కబ్జాదారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను అమ్మకం సామన్య ప్రజలను మోసగిస్తున్నారు.

లేఖ కు స్పందించని రెవెన్యూ :

మిర్యాలగూడ లోని షాబునగర్ ,తాళ్లగడ్డలో విస్తరించి ఉన్న చిన్న చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్ ఏఈ ఒకరు చెరువుకు సంబంధించిన వివరాలు ,నక్ష , కావాలని గత ఏడాది సెప్టెంబర్ ,ఈ ఏడాది జనవరి 5 న రెవెన్యూ అధికారులకు లేఖ పంపారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారుల లేఖ కు స్పందించలేదు. చెరువు బఫర్ జోన్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటే రెవెన్యూ నుంచి సమగ్ర సమాచారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు వాపోతున్నారు.దీనివలన చెరువు హద్దులు నిర్ణయించడానికి రెవెన్యూ సహకారం అవసరమని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు .

Next Story