- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి జిల్లాలో ఎస్ఐల బదిలీలు
by Bhanu |
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐజీ సత్యనారాయణ మార్పులు చేర్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు.

X
దిశ, నల్లగొండ క్రైం: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐజీ సత్యనారాయణ మార్పులు చేర్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. హాలియా ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్ రెడ్డికి సీఐగా ప్రమోషన్ రావడంతో హాలియా సీఐగా సతీష్ రెడ్డి నియామకమయ్యారు. హాలియా సీఐగా పనిచేస్తున్న జనార్దన్ గౌడ్ ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు.
తిప్పర్తిలో పని చేస్తున్న సాయి ప్రశాంత్ హాలియా ఎస్ఐగా, త్రిపురారంలో పనిచేస్తున్న ఎస్ఐ ప్రసాద్ పెద్దవూరకు, హుజూర్ నగర్ లో పనిచేస్తున్న ఎస్ఐ ముత్తయ్య నాగార్జున సాగర్ కు, మిర్యాలగూడ షీ టీంలో పని చేస్తున్న ఎస్ఐ నరేష్ త్రిపురారం పోలీస్ స్టేషన్ కు బదిలీఅయ్యారు. కాగా, సాగర్ ఎస్ఐ సంపత్, పెద్దవూర ఎస్ఐ వీరబాబును నల్లగొండ వీఆర్ కి అటాచ్ చేశారు.
Next Story






