విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ..

by Bhanu |

సూర్యాపేట జిల్లా పోలీసు విభాగం చేపట్టిన "పోలీసు ప్రజా భరోసా" కార్యక్రమంలో భాగంగా బుధవారం పెన్ పహాడ్ మండలంలోని అనాజిపురం

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ..
X

దిశ, పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పోలీసు విభాగం చేపట్టిన "పోలీసు ప్రజా భరోసా" కార్యక్రమంలో భాగంగా బుధవారం పెన్ పహాడ్ మండలంలోని అనాజిపురం గ్రామంలో గల మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై గోపికృష్ణ ప్రత్యేకంగా పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ప్రోత్సాహాన్ని కలిగించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ గారి దిశానిర్దేశంలో పోలీసులు విద్యా, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదువులు చదవాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవాలి అని పిలుపునిచ్చారు.

అంతేగాక, తల్లిదండ్రుల కలల్ని నిజం చేయడానికి ప్రతీ విద్యార్థి మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావంతో చదువుపై దృష్టి తగ్గకుండా జాగ్రత్త పడాలని, బదులుగా ఇంటర్నెట్‌ను జ్ఞానం పెంచుకునే దిశగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మురళి, వంశీ, భూపాల్, భీమేష్, శైలజ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story