విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు.. రూ.1.50 లక్షల నష్టం

by Bhanu |   (  Updated:2025-07-11 03:59:53  IST  )

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మహంకాళి గూడెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు.. రూ.1.50 లక్షల నష్టం
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మహంకాళి గూడెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర ఆర్ధిక నష్టానికి గురిచేసింది. ఈ ఘటనలో ఇంటితో పాటు ఇంటి లోపల ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

గ్రామానికి చెందిన ఆడావత్ చంద్రశేఖర్ కుటుంబం గురువారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగినట్లు గమనించారు. వెంటనే వారు లోపలికి వెళ్లి చూసినప్పుడు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాప్తి చెందినట్లు తెలిసింది.

ఈ అగ్ని ప్రమాదంలో డబల్ కాట్ బెడ్, దాని కింద ఉంచిన రూ.60 వేలు నగదు, లాప్‌టాప్, టీవీ, హోమ్ థియేటర్, వెల్డింగ్ మిషన్, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమవడంతో సుమారు రూ.1.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు. తాము ఎదుర్కొన్న ఈ నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలంటూ బాధిత కుటుంబం అధికారులను వేడుకుంటోంది.


Next Story