- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను కొట్టి చంపింది.. బంధువుల ముందు ఎలా డ్రామా చేసిందో చూడండి!
నల్లగొండలో ఉస్మాన్పుర కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీల్(zp స్కూల్ అటెండర్) గత నెల 24న మృతి చెందారు.

దిశ, నల్లగొండ:
నల్లగొండలో ఉస్మాన్పుర కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీల్(zp స్కూల్ అటెండర్) గత నెల 24న మృతి చెందారు. అతనికి ఇద్దరు పిల్లలు కూతురు ఇంటర్ చదువుతుంది. బాబు 6 సంవత్సరాలు వయసు. తన ఆరోగ్యం బాగా లేక గత రెండు నెలలుగా ఉద్యోగానికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. అయినా భార్య ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు. విషయం తెలుసుకున్న ఖలీల్ అన్న అతని భార్యను నిలదీయగా.. ఆసుపత్రికి తరలించింది.
గత నెల 24వ తేదీన సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం ఖలీల్ భార్యకు కోపం కట్టలు తెచ్చుకొని గట్టిగా తన భర్తను గోడకు కొట్టడంతో.. అతను అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే ఆమె చాకచక్యంగా తన భర్తను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి తన బంధువులకు,కుటుంబ సభ్యులకు క్రింద పడ్డాడని తెలిపింది. చికిత్స చేసిన డాక్టర్లు అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులకు ఆమెపై అనుమానం రావడం తో ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన సిఐ రాజశేఖర్ రెడ్డి పోస్టుమార్టం చేపించారు. శుక్రవారం పోస్టుమార్టం రిపోర్టులో అతడిని ఎవరో బలంగా కొట్టడం ద్వారా చనిపోయాడని తేలింది.
భార్యనే కొట్టి చంపింది..
సీఐ రాజశేఖర్ రెడ్డిని దిశ సంప్రదించి మాట్లాడగా.. ఖలీల్ మరణంపై మొదటి నుంచి తమకు అనుమానం ఉందన్నారు. అతడి శరీరం మీద పలు గాయాలు ఉండటం వల్ల వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించగా..అతడిని కొట్టి చంపినట్లు తెలిసిందని తెలిపారు. ఇదే విషయమై తన భార్య ను విచారణ చేయగా.. తానే కొట్టినట్లు ఒప్పుకుందన్నారు. ఇందులో ఇంకా ఎవరైనా హస్తం ఉందా..?ఉద్యోగం కోసమే అతడిని చంపిందా లేక ఆమె కి ఏమైనా అక్రమ సంబంధం వల్ల ఇలా చేసిందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.






