ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

by Ratna Kumari |

హాలియా పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను హాలియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ, హాలియా : హాలియా పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను హాలియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై బండి సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హాలియాలోని సాగర్ రోడ్డు కొత్తమాస్ ఐ ట్రేడర్స్ సమీపంలోని ఓ ఇంట్లో ఆదివారం ఏడుగురు వ్యక్తులు అందర్ బాహర్ పేకాట ఆడుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పేకాట రాయుళ్లను పట్టుకునే సమయంలో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిలో బిజిలి సుధాకర్, బొడ్డుపల్లి సైదులు, పల్లె మధుసూదన్ రెడ్డి, జిల్లేపల్లి శ్రీనివాసాచారి, ఉడుతూరి ప్రభాకర్ రెడ్డి, షేక్ సైదా తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.53,600 నగదు 7 మొబైల్ ఫోన్లు మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాలియాలో కొంతమంది ఆర్గనైజర్ గా పేకాటను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యక్తులపై పూర్తి లోతైన దర్యాప్తు చేస్తున్నామని అలాంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Next Story