- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14 ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు
రాజాపేట మండలం రఘునాథపురం వాగు నుంచి అక్రమంగా భారీగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను రాజపేట పోలీసులు సీజ్ చేశారు.

దిశ, రాజాపేట : రాజాపేట మండలం రఘునాథపురం వాగు నుంచి అక్రమంగా భారీగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను రాజపేట పోలీసులు పట్టుకున్నారు. ఇన్ చార్జి తహసిల్దార్ ప్రదీప్ ఆదేశాల మేరకు ఆర్ఐ నర్సింహులు ట్రాక్టర్లను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఏఎస్సై ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం 12 ఇసుక లోడు ఉన్న ట్రాక్టర్లు రెండు ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యాదగిరిగుట్ట మండలం కు ఇసుక అనుమతి తీసుకొని రాజపేట మండల రెవెన్యూ పరిధిలో ఇసుకను తోడడం, కొందరు డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడం, కొన్ని ట్రాక్టర్లకు పేపర్స్ కూడా సరిగ్గా లేకపోవడం, ట్రాక్టర్లకు ఇంజన్ లకు నెంబర్లు లేకపోవడం నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయల విలువైన ఇసుక అక్రమంగా తరలుతోంది. ట్రాక్టర్లను సీజ్ చేసి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించి యజమానులపై కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






