- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో భర్త.. ప్రశ్నించిన భార్యను ఏం చేశాడో చూడండి!
by Naveena |
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటి గూడెంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

X
దిశ, గుర్రంపోడు: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటి గూడెంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన భర్తను భార్య అరుణ (35) ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య తీవ్ర రూపం దాల్చింది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చే భర్తపై ఆమె కోపం వ్యక్తం చేయగా.. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story






