మందుబాబులకు అడ్డాగా పాఠశాల

by velandi.Saikiran |

విద్యనిభ్యసించవలసిన పాఠశాలలు సాయంత్రం అయ్యిందంటే మందుబాబులకు అడ్డగా మారిపోతున్నాయి. అందుకు నిదర్శనం

మందుబాబులకు అడ్డాగా పాఠశాల
X

దిశ, వలిగొండ : విద్యనిభ్యసించవలసిన పాఠశాలలు సాయంత్రం అయ్యిందంటే మందుబాబులకు అడ్డగా మారిపోతున్నాయి. అందుకు నిదర్శనం మండలంలోని రెడ్ల రేపాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ స్కూల్ లో సాయంత్రం తర్వాత అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఈ విషయంపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు... గ్రామస్తులకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు.

ఈ మందుబాబుల కార‌ణంగా.... విద్యార్థులు పాఠశాలలకు రావాలంటే జింకుతున్నారని తెలుస్తోంది. ప్రధానోపాధ్యాయుని రూము, వరండాలలో సీసాలు పగులగొట్టి వెదజల్లుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీనివ‌ల్ల‌ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖ పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిలను పట్టుకొని, శిక్షించాలని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుచున్నారు.

Next Story