విద్యార్థుల చేతుల్లో పాఠశాల పరిపాలన

by Ratna Kumari |   (  Updated:2026-03-03 08:44:04  IST  )

నేరేడుగొమ్ము మండల ప‌రిధిలోని తిమ్మాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు.

విద్యార్థుల చేతుల్లో పాఠశాల పరిపాలన
X

దిశ, నేరేడుగొమ్ము : నేరేడుగొమ్ము మండల ప‌రిధిలోని తిమ్మాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులే ఉపాధ్యాయులు, అధికారులుగా బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వ‌హించి అందరినీ ఆకట్టుకున్నారు. DEOగా విద్యార్థి రితీష్, MEOగా అంజి, ప్రధానోపాధ్యాయురాలుగా వైష్ణవి కీల‌క పాత్రలు పోషించారు. అలాగే ఉపాధ్యాయులుగా శివలీల, జయప్రకాశ్, ఇందు, తేజశ్రీ, కావ్యశ్రీ, మేఘనా, నిహారిక, అనీష్ విద్యార్థులు తరగతుల్లో బోధన నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు చక్కటి ప్రణాళికతో పాఠాలు బోధించి నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిపాలనా అవగాహన పెంపొందించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story