కేసీఆర్ స్పూర్తితోనే స‌ర్పంచ్ లు విజ‌యం : KTR

by Ratna Kumari |

దిశ, నల్లగొండ బ్యూరో: కేసీఆర్ అందించిన స్ఫూర్తితోనే గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు విజయం సాధించారని

కేసీఆర్ స్పూర్తితోనే స‌ర్పంచ్ లు విజ‌యం : KTR
X

దిశ, నల్లగొండ బ్యూరో: కేసీఆర్ అందించిన స్ఫూర్తితోనే గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు విజయం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సర్పంచులు, ఉప సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని భయ భ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేసినా, దాడులు నిర్వహించిన మొక్కవోని ధైర్యంతో స్థాయిలో బీఆర్ఎస్ సైన్యం పని చేసింది అన్నారు. కార్యకర్తల పని తీరు వల్లే 40 శాతం పంచాయతీలను తమ పార్టీ కైవసం చేస్తుందన్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ వెనుకంజ వేసిందన్నారు. అలాగే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజలు గుణపాఠం చెబుతారని భయపడి నామినేటెడ్ పద్ధతిలో వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది అన్నారు. తమ పార్టీలో గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధిక నిధులు ఇస్తామని ప్రలోభాల గురిచేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గమనించాల్సిన విషయం ఏమిటంటే..? గతంలో మన పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలన్నారు.


అలాగే ఇప్పటివరకు ఒక రూపాయి నిధులు ఇవ్వని వాళ్లు సర్పంచ్ ల‌కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చెందుకు కేసీఆర్, హరీష్ రావు ల‌పై 40 కేసులు నమోదు చేస్తున్నట్లు పత్రికలకు లీకులిస్తూ కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి ఏ కేసులు పెడుతున్నారు..? ఎందుకు పెడుతున్నారో ప్రకటించి హోమ్ మినిస్టర్ హోదాలో అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కేసీఆర్ చేసిన పదేళ్ల లో అప్పులను ప్రజా సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండేళ్ల కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల 50 వేల కోట్ల అప్పుచేసి ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణ నీటి జలాలలో తెలంగాణకు ముఖ్యంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నల్లగొండ జిల్లాల‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం మధ్యలో బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు.


ఇలా ఉంటే.. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు త్వరలో జిల్లా కేంద్రాలలో వర్క షాప్ నిర్వహిస్తున్నట్లు, అంతేకాకుండా సర్పంచులను అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళ తరఫున లీగల్ గా పార్టీ కొట్లాడుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ తర్వాత నోటీసులు ఇస్తామ‌ని రేవంత్ లీకు ఇవ్వ‌డం హాస్య‌స్ప‌దంగా ఉంద‌న్నారు. వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రకమైన లీకులతోనే ఏడుస్తున్నాడని విమర్శించాడు. గురించి ఏడ్చి రిపోర్ట్ రాగానే కనపడని చోట మలచి పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మల్లెపూలలాగా ఉన్నాడని, కాంగ్రెస్ బీజేపీలో కంటే గొప్పగా 24 గంటల కరెంటు సప్లై చేసిన విషయం రిపోర్ట్ లో వచ్చింది కాబట్టి నోరు మూసుకున్నావని అన్నారు. అంతేకాకుండా కాలేశ్వరం మీద ఏడవడం తప్ప దాన్ని రిపేర్ చేయకుండా కబుర్ల తోకాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు. అనంతరం 250 మంది సర్పంచులకు, వారితోపాటు ఉప సర్పంచ్లకు కేటీఆర్ చేతుల మీదుగా సన్మానం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ అధ్యక్షులు జరిగిన ఈ సభలో మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, తిప్పన విజయసింహ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, చకిలం అనిల్ కుమార్ , చాడ కిషన్ రెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story