సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే.. గ్రామంలో కోతుల బెడదను నిర్మూలిస్తా: సర్పంచ్ అభ్యర్థి

by Bhanu |

గత సర్పంచ్ ఎన్నికల్లో తాను గెలిచినా అప్పటి అధికార పార్టీ నాయకులు ప్రజా తీర్పు అపహస్యం చేస్తూ ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించుకున్నారని సంస్థాన్ నారాయణపురం ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. తనను సర్పంచ్‌గా ఎన్నుకున్న మరుక్షణమే గ్రామంలో ఉన్న కోతుల బెడదను పూర్తిగా నిర్మూలిస్తానని తెలిపారు.

సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే.. గ్రామంలో కోతుల బెడదను నిర్మూలిస్తా: సర్పంచ్ అభ్యర్థి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: గత సర్పంచ్ ఎన్నికల్లో తాను గెలిచినా అప్పటి అధికార పార్టీ నాయకులు ప్రజా తీర్పు అపహస్యం చేస్తూ ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించుకున్నారని సంస్థాన్ నారాయణపురం ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆరు సంవత్సరాలుగా నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సీపీఐ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో ప్రజాసేవ చేయడానికి తిరిగి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. గ్రామ ప్రజలు ఈసారి తనకు అవకాశం కల్పిస్తే మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

తనను సర్పంచ్‌గా ఎన్నుకున్న మరుక్షణమే గ్రామంలో ఉన్న కోతుల బెడదను పూర్తిగా నిర్మూలిస్తానని తెలిపారు. గత సర్పంచ్ కాలంలో కోతుల ఏరివేత కోసం చందాలు వసూలు చేసి కోతులు పట్టిన వారికి పూర్తిగా డబ్బులు చెల్లించకపోవడంతో తిరిగి ఇక్కడ వదిలి వెళ్లారని గుర్తుచేశారు. సర్పంచ్‌గా గెలిచిన వెంటనే తన సొంత ఖర్చుతో కోతులన్నిటిని అటవీకి తరలించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామంలో యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి, క్రీడా మైదానం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని, తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మందుగుల బాలకృష్ణ, జక్కిడి చంద్రారెడ్డి, కోన్ రెడ్డి నరసింహ సీపీఐ శాఖ సెక్రెటరీ పల్లె మల్లారెడ్డి, వివిధ వార్డులకు మిత్రపక్షల తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story