- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే రోజు.. ఒకే కేంద్రం.. తల్లి,కుమారుడు కలిసి టైప్‌రైటింగ్ పరీక్ష!
నేటి పోటీ ప్రపంచంలో చదువుకు వయసుతో పనిలేదని మరోసారి నిరూపించారు కోదాడకు చెందిన తల్లి–కుమారుడు.

దిశ, కోదాడ: నేటి పోటీ ప్రపంచంలో చదువుకు వయసుతో పనిలేదని మరోసారి నిరూపించారు కోదాడకు చెందిన తల్లి–కుమారుడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన అల్లిక శ్రీలత ఆమె కుమారుడు అల్లిక ఆశిక్ ఒకే రోజు, ఒకే పరీక్షా కేంద్రంలో టైప్‌రైటింగ్ పరీక్ష రాసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శుక్రవారం నిర్వహించిన టైప్‌రైటింగ్ పరీక్షలకు వీరిద్దరూ హాజరయ్యారు. కోదాడలోని శ్రీ గాయత్రి టైప్ అండ్ షార్ట్‌హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న ఈ తల్లి–కుమారుడు, సూర్యాపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.
కుమారుడి ప్రయత్నం… కెరీర్‌పై స్పష్టమైన లక్ష్యం అల్లిక ఆశిక్ ఇప్పటికే గతంలో జూలై 2025లో నిర్వహించిన ఇంగ్లీష్ జూనియర్ (25 డబ్ల్యూ పిఎం) టైప్‌రైటింగ్ పరీక్షను సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణుడయ్యాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంగ్లీష్ లోయర్ (30 డబ్ల్యూ పిఎం) పరీక్షకు హాజరయ్యాడు. తల్లితో పాటు పరీక్ష రాయడం తనకు మరింత ప్రేరణ నిస్తుందని ఆశిక్ చెబుతున్నాడు. తల్లిలో తగ్గని పట్టుదల తన కుమారుడితో కలిసి చదువుతూ, పరీక్షలు రాస్తూ తల్లి అల్లిక శ్రీలత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఈసారి ఇంగ్లీష్ హయ్యర్ (45 డబ్ల్యూ పిఎం) పరీక్షకు హాజరయ్యారు. కుటుంబ బాధ్యతల మధ్యనూ చదువును వదలని ఆమె పట్టుదల అందరికీ ఆదర్శంగా మారింది.
అందరి అభినందనలు..
ఒకే రోజు, ఒకే కేంద్రంలో తల్లి హయ్యర్, కుమారుడు లోయర్ పరీక్షలు రాయడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు తెలిపారు. తల్లితో పోటీ పడి చదువుతున్న కుమారుడు, కుమారుడితో కలిసి ముందుకు సాగుతున్న తల్లి”గా ఈ ఘట్టం అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది.
ఆదర్శంగా నిలుస్తున్న తల్లి–కుమారుడు..
విద్యకు వయస్సు అడ్డుకాదని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని చాటుతూ అల్లిక శ్రీలత – అల్లిక ఆశిక్‌ల కథ నేటి యువతకు, తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తోంది.






