- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాల్వేరు సాయిచరణ్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నత స్థాయి గ్రూపు 1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల చేశారు.

దిశ,రామన్నపేట : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నత స్థాయి గ్రూపు 1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల చేశారు. గ్రూప్ వన్ ఫలితాలలో రామన్నపేట పట్టణానికి చెందిన సాల్వేరు సత్యనారాయణ కుమారుడు సాల్వేరు సాయిచరణ్ 61వ (ఎం జడ్ 2)ర్యాంకు సాధించారు. సాయిచరణ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏసిక్ (కార్మిక రాజ్య బీమా సంస్థ) లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్) గా 6 సంవత్సరాలుగా పని చేస్తూ.. గత అక్టోబర్ లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గెజిటెడ్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం గ్రూప్ 1 లో 61 వ ర్యాంక్ సాధించి రాష్ట్ర అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించారు. దీంతో మొత్తం 10 ప్రభుత్వ పోస్టులు సాధించిన ఘనత సాల్వేరు సాయిచరణ్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చరణ్ మిత్రులు, బంధువులు అభినందనలు తెలియజేశారు.ప్రభుత్వ ఉద్యోగాలతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నత స్థాయి గ్రూపు 1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల చేశారు.






