- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ ,మర్రిగూడ: ఆడపిల్లకు చదువు ఎందుకు లే అని అనుకునే రోజులు ఇవి. అసలే ఆ బాలిక ఫ్లోరోసిస్ దివ్యాంగురాలు..అయినా చదువులో సరస్వతిగా రాణిస్తుంది. ఆమె భవిష్యత్తును నిర్ణయించేదే సరస్వతి అనుకుని ఆ తండ్రి ఆ చదువుల తల్లిని తనకున్న దాంట్లో చదువుపిస్తూ ఆ గ్రామంలో శభాష్ అనిపించుకుంటున్నాడు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షకు తండ్రి ఎత్తుకొని వచ్చి పరీక్ష హాల్లో కూర్చోబెట్టి పరీక్ష రాయించి మరి ఎత్తుకొని వెళ్తుండడం అందరిని ముక్కున వేలేసుకునేటట్లు చేసింది. అందుకే ఆ తండ్రికి వందనం.. వందనం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన మోర సత్యనారాయణ ధనమ్మ దంపతుల కూతురు శివాని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఫ్లోరోసిస్ దివ్యంగురాలైన శివాని నీ తండ్రి సత్యనారాయణ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి పరీక్ష రాయించుకుని తన సంకనా కూర్చోబెట్టుకొని వెళ్తుండడం అందరినీ ఆ తండ్రి ఆకట్టుకున్నారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు తన కూతురు తనకి ముద్దు అన్నట్టుగా సంకనా ఎత్తుకొని మోసుకొని వెళ్లడం నిజంగా ఆ తండ్రికి దిశ తరపున కృతజ్ఞతలు తెలుపుదాం.






