- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరేడుగొమ్ము గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికల భద్రత ప్రశ్నార్థకం
నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికల భద్రత తీవ్రమైన సమస్యగా మారింది.

దిశ, నేరేడుగొమ్ము : నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికల భద్రత తీవ్రమైన సమస్యగా మారింది. పాఠశాల పక్కన చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనుల సమయంలో కాంట్రాక్టర్ ప్రహరీ గోడను కూలగొట్టగా, ఈ ఘటన జరిగిన నాలుగు నెలల గడిచినా ఇప్పటివరకు పునర్నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సుమారు 200 మంది బాలికలు హాస్టల్‌లో నివసిస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో కుక్కలు, పందులు, కోతులు పాఠశాల, హాస్టల్ ఆవరణలోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తూ బాలికలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కలు పిల్లలను కరవడం, కోతులు అన్నాన్ని లాగేసుకోవడం, పుస్తకాలను చింపివేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో బాలికలు పాఠశాల ఆవరణలో ఆడుకోవడానికీ, రాత్రివేళ హాస్టల్‌లో ఉండడానికీ భయపడుతున్నారు. ప్రధానోపాధ్యాయులు ఈ సమస్యపై పలు సార్లు తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫిర్యాదులు అందజేశారు, అయినప్పటికీ ఇప్పటివరకు తక్షణ చర్యలు తీసుకోలేకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమని తెలిపారు. ప్రభుత్వం భేటీ బచావో–భేటీ పడావో నినాదాలు ఇస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికల భద్రతపై నిర్లక్ష్యం కొనసాగడం ప్రశ్నార్థకం. స్థానికులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ నేవావత్ బాలునాయక్ ను ఈ గిరిజన బాలికల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, ప్రహరీ గోడ మంజూరు చేయించి తక్షణమే పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇంకా చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.






