సురక్షిత ప్రయాణం - అందరి బాధ్యత

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-23 11:23:05  IST  )

"రహదారి నిబంధనలు పాటించడం ప్రాణ రక్షణకు శ్రీరామరక్ష" అని హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, ఏసీపీ మాధవి పిలుపునిచ్చారు.

సురక్షిత ప్రయాణం - అందరి బాధ్యత
X

దిశ, ​హుజూరాబాద్ రూరల్ : "రహదారి నిబంధనలు పాటించడం ప్రాణ రక్షణకు శ్రీరామరక్ష" అని హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, ఏసీపీ మాధవి పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులకు భారీ అవగాహన క‌ల్పించారు. టౌన్ సీఐ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అధికారులు విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ​​ఆర్డీఓ రమేష్ బాబు, ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. యువత అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడపాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుండి కాపాడుతుందని తెలిపారు.​ డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం, అతివేగం మరియు త్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తన ప్రాణానికే కాకుండా ఎదుటివారికి కూడా ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువత చేసే చిన్న పొరపాట్లు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నాయని వారు పేర్కొన్నారు. ​​డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవాలనుకునే విద్యార్థులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకుంటే, ప్రభుత్వ చలానా మేరకే తక్కువ ఖర్చుతో లైసెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు.​కార్యక్రమం ముగింపులో సైదాపూర్ ఎస్సై స్వాతి విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిఐలు పులి వెంకట్ గౌడ్, రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్సైలు తిరుపతి, వివేక్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Next Story