- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు లోకసాని పద్మారెడ్డి ఐసీఏఆర్ జాతీయ అగ్రో ఫారెస్ట్రీ కాన్ఫరెన్స్ లో ప్రతిభ
మండల పరిధిలోని పోలెపల్లి గ్రామానికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి ఐసీఏఆర్ జాతీయ అగ్రో ఫారెస్ట్రీ కాన్ఫరెన్స్ లో ప్రతిభ కనబరిచారు.

దిశ, చందంపేట : మండల పరిధిలోని పోలెపల్లి గ్రామానికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి ఐసీఏఆర్ జాతీయ అగ్రో ఫారెస్ట్రీ కాన్ఫరెన్స్ లో ప్రతిభ కనబరిచారు. ఐసీఏఆర్-న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఆసియన్ అగ్రో ఫారెస్ట్రీ ట్రీస్ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించిన ఆటారీ సంస్థకు, గడ్డిపల్లి కేవీకే వారికి.. ఆటారీ డైరెక్టర్ షేక్ మీరా కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో తనతో పాటు వచ్చి ప్రతి విషయంలో సహకరించిన జీవి ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అగ్రో ఫారెస్ట్రీ ప్రాధాన్యతను వివరించారు. అగ్రో ఫారెస్ట్రీ అనేది వ్యవసాయం అడవి చెట్లను ఒకే భూమిలో సమన్వయం చేస్తూ సాగు చేసే విధానమని ఆయన తెలిపారు. ఈ విధానంలో పంటలతో పాటు ఉపయోగకరమైన చెట్లను నాటడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా నేల సారవంతం పెరిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అగ్రో ఫారెస్ట్రీ విధానం ద్వారా నేలలో నత్రజని స్థిరీకరణ, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం తగ్గడం, దీర్ఘకాలిక ఆదాయం, జీవ వైవిధ్యం పెరగడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. సుబాబుల్, సిరియా టేక్, సిరిశెట్టి, వేప, మామిడి, జామ, నేరేడు వంటి చెట్లు ఆగ్రో ఫారెస్ట్రీకి అనుకూలమని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడమే కాకుండా, భవిష్యత్ తరాలకు భూమిని ఆరోగ్యంగా నిలుపుకునే అవకాశం ఉంటుందని తన ప్రసంగంలో వివరించారు.






