- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం : ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దిశ, చందంపేట : గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

దిశ, చందంపేట : గ్రామాభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చందంపేట మండలంలోని మానవత్ తండా గ్రామంలో రూ.2కోట్ల 3లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను పెద్ద ఎత్తున తీర్చేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను చేపడుతోంది. ప్రజల నుంచి వసూలు చేసిన ప్రతి పైసా ప్రజల సంక్షేమానికే వినియోగించడమే మా ప్రభుత్వం యొక్క ధ్యేయం.గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తోంది.
పొల్లేపల్లి గ్రామానికి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.దేశాభివృద్ధిలో గ్రామాలే కీలకమని నమ్మే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన అన్నారు. గతంలో గ్రామాలలో సబ్ స్టేషన్లు దూరంగా ఉండటం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడి, వృద్ధులు చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో విద్యుత్ అంతరాయం ఉండకూడదనే తపనతో మారుమూల గ్రామాలలో సబ్ స్టేషన్ నిర్మాణాలను చేపట్టి, ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేనని ఆయన అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు DE బాల్య, AD సైదులు, నాగేశ్వరావు, దీప్తి, AE వసంత్, లక్ష్మినారాయణ, గ్రామ సర్పంచ్ రామావత్ కవిత, మాజీ ఎంపీపీ గోవింద్ యాదవ్, భవాని పవన్ కుమార్,బిక్కు నాయక్, మాజీ జడ్పీటీసి బుజ్జి లచ్చిరామ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయి రాథోడ్, చందంపేట సర్పంచ్ సాధిక్ పాల్గొన్నారు.






