- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BSP గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా రుద్రవరం సునీల్

X
దిశ, చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రుద్రవరం సునీల్ బహుజన్ సమాజ్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. BSP రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ సునీల్‌కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజనుల ఐక్యతకు కృషి చేసి, బహుజన రాజ్య స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన, చీఫ్ కో- ఆర్డినేటర్ Dr.RS. ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story






