- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెల వెల బోయిన రుద్రమ చెరువు.. అడుగంటి కళ తప్పి
రుద్రమ చెరువు కళ తప్పింది.నీళ్లు లేక నిట్టూరుస్తుంది. ఫలితంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.సూర్యాపేట జిల్లాలోని అతిపెద్ద వాటిలో రుద్రమ చెరువు ఇదొకటి.

దిశ, తుంగతుర్తి: రుద్రమ చెరువు కళ తప్పింది.నీళ్లు లేక నిట్టూరుస్తుంది. ఫలితంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.సూర్యాపేట జిల్లాలోని అతిపెద్ద వాటిలో రుద్రమ చెరువు ఇదొకటి. ఇది వందలాది ఎకరాల్లో విస్తరించి కడుపునిండా నీళ్లను నింపుకుంటుంది. దీంతో వర్షాకాలమైన, ఎండాకాలమైన నిత్యం జలకళతో ఈ చెరువు కళకళలాడుతూ చూపరులకు కనువిందు చేస్తుంది. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ పరిధిలో ఉన్న రుద్రమ చెరువులో ప్రస్తుతం నీటిమట్టం దారుణంగా తగ్గిపోయి ఎండిపోయే దశకు చేరుకుంది. ఫలితంగా ఈ చెరువు నీటి ద్వారా ఖరీఫ్,రబీ సీజన్లలో వివిధ ప్రాంతాల పరిధిలోని వేలాది ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా పర్సయిపల్లి, కొత్తపల్లి, కాశీతండ, జొన్నలగడ్డ తండ, సీతారాంపురం, పసునూరు, అన్నారం, సంగెం, తదితర ప్రాంతాల్లో సాగుకు ఈ చెరువు నీళ్లే పెద్ద దిక్కు.
అంతేకాకుండా భూగర్భ జలాలు పెరిగి సాగుకు సౌకర్యం కలుగుతుంది.రుద్రమ చెరువుని రిజర్వాయర్ గా మారిస్తే మరికొన్ని ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుందనే విషయం దశాబ్దాల కాలం నుండి రాజకీయ నేతల నోటి నుండి విలువడే ముచ్చట.అయితే పేరుకే చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం శూన్యం.శ్రీరామ్ సాగర్ రెండవ దశ నీళ్లను పస్తాల గ్రామం మీదుగా కాలువల ద్వారా చెరువులోకి రప్పించే కార్యక్రమాలు మొదట్లో జరిగాయి.అయితే తవ్విన కాలువ కూడా అసంపూర్తిగానే ఉంది.దీంతో చెరువులోకి నీళ్లు రాలేని పరిస్థితి నెలకొంది.ఇక మరోవైపు మల్లన్నగుట్ట పై భాగం నుండి చిన్నపాటి కాలువ ద్వారా చెరువులోకి నీళ్ల మళ్లింపు జరుగుతున్నప్పటికీ అది అంతంత మాత్రమే.అయితే ఈసారి వర్షాలు సక్రమంగా కురిస్తేనే రుద్రమ చెరువు నీళ్లతోనుండి సజీవంగా ఉండే పరిస్థితి.






