హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం..

by Kodari Anjali |

పెద్దవూర మండల పరిధిలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కారు ఢీకొట్టి నలుగురు గాయపడ్డారు.

హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం..
X

దిశ, పెద్దవూర: పెద్దవూర మండల పరిధిలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉరబవీతండ సమీపంలోని లెఫ్ట్ కెనాల్ బ్రిడ్జిని నాగార్జున సాగర్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను నాగార్జునసాగర్ ప్రభుత్వ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story