రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు ... ప్రాణాపాయ స్థితిలో చికిత్స

by Bhanu |   (  Updated:2025-05-15 10:08:34  IST  )

చిలుకూరు మండలంలోని సీతారామపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు ... ప్రాణాపాయ స్థితిలో చికిత్స
X

దిశ, చిలుకూరు: చిలుకూరు మండలంలోని సీతారామపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి ఒకరు తీవ్రంగా గాయపడగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమాచారం. స్థానికుల కథనం మేరకు, పాలె అన్నారానికి చెందిన దేశబోయిన వెంకటేశ్వర్లు అలియాస్ ఏసు ప్రభు కోదాడ - హుజూర్నగర్ ప్రధాన రహదారి నుంచి తన గ్రామం వైపు మలుపు తిరుగుతున్న సమయంలో, అదే దారిపై వేగంగా వస్తున్న ఓ కారు అతన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హుజూర్నగర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లును ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Next Story