- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pulichintala : పులిచింతలకు పెరుగుతున్న వరద నీరు
ఎగువ ప్రాంతం నాగార్జున సాగర్ నుండి 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది.

దిశ, చింతలపాలెం : ఎగువ ప్రాంతం నాగార్జున సాగర్ నుండి 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 42.16 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 163.94అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 1,56,964క్యూసెక్కు లు కాగా అధికారులు మూడు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 47,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా నాలుగు యూనిట్ల నుండి 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 18,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.






