- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీడీఓ వర్సెస్ సెక్రటరీలు: "నా ఆఫీస్.. నేను చెప్పిందే వేదం" అంటూ వేధింపులు?
శాలిగౌరారం ఎంపీడీవో తమని ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, నల్లగొండ క్రైం: షటప్.. ఇది ‘‘నా ఆఫీస్ ... నేను చెప్పిందే చేయాలి. మీ జీతాలు కట్ చేయకుండా చూసుకోండి. దీనికి నాకు ప్రతిఫలం కావాలి. లేదంటే మీ అంతు చూస్తా’’ అంటూ శాలిగౌరారంలోని వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులను ఎంపీడీవో వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. తన వెనుక ఎంపీ స్థాయి వ్యక్తులు ఉన్నారని, తనను ఏం చేయలేరని వేధింపులకు గురిచేస్తున్నట్లుగా వారు వాపోతున్నారు. ఓపిక పట్టీ.. అంతా ఒక్కటై నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ కు ఫిర్యాదు చేశారు.
ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి బెదిరింపులు..
శాలిగౌరారం ఎంపీడీవో తమని ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీతం ఆపుతూ, సస్పెండ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని వారు వాపోతున్నారు. గతంలో మమ్మల్ని బెదిరించి తన ఆఫీసుకు ఎయిర్ కూలర్ ఇప్పించుకున్నారని పేర్కొంటున్నారు. గత సర్పంచ్ ఎలక్షన్లో ఎన్నికల ఖర్చుకు, భోజన సదుపాయాలకోసం ప్రభుత్వం అన్ని గ్రామాల కార్యదర్శులకు కొంత గ్రాంట్ రిలీజ్ చేసింది. దాంట్లో కొద్దిమొత్తంలోనే పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చి, తిరిగి ఆ అమౌంట్ తనకు ఇవ్వాలని ప్రతీ మీటింగ్ లోను ఇదే విషయంపై లేవనెత్తున్నట్లు తెలుస్తోంది. తాను డీడీఓనని జీతం ఆపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇంక్రిమెంట్ చేయాలంటే ల్యాప్ టాప్ కొనివ్వాలని ఖరాకండీగా చెబుతన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. శాలిగౌరారం మండలంలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు డ్యూటీ సర్టిఫికెట్ కావాలంటే తాను చాలా దూరం నుంచి వస్తున్నానంటూ డీజిల్ కు డబ్బు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ కాలంలో పంచాయతీ కార్యదర్శులు పెట్టిన ఖర్చులను తిరిగి చెల్లించొద్దంటూ ఎంపీడీవో సదరు సర్పంచులకు ఉప సర్పంచ్ లకు కు చెబుతూ తమను భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. గతంలో కలెక్టర్ ఉత్తర్వులు లేకున్నా తానే కొన్ని గ్రామాలలో స్పెషల్ అధికారిగా నకిలీ ఉత్తర్వులతో చలామణి అయ్యారని, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.
దళిత సంఘాలు ఫైర్..
శాలిగౌరారం మండలంలో కేంద్రంలో మహనీయుల ఉత్సవాలకు ఎమ్మార్పీఎస్ , దళిత సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి దళితులను అవమానపరుస్తున్నారని దళిత సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు. ఈ నెల 5న జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించలేదని, దళిత సంఘాలు అంటే వివక్ష చూపెడుతుందన్నారు. గతంలో స్థానిక ఎంపీడీఓ మహనీయులు ఉత్సవాలకు మూడు రోజుల ముందు సమాచారాన్ని ఇచ్చేవారని, ఆమె బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సమాచారం ఇవ్వకుండా దళిత ఉద్యమకారులను అవమానిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏదైనా సమస్యపై దళిత నాయకుడు, ప్రజాప్రతినిధి, లేక తన కార్యాలయంలో పని చేసే అధికారి వెళ్లాంటే గంటల తరబడి బయట వేచి ఉండాలని, మొన్న మండల స్థాయి అధికారి గంట సేపు బయట నిలబెట్టింది నిజం కదా, తన ఛాంబర్ లో తన కులానికి చెందిన వాళ్లు పోతే వాళ్లు కూర్చోవడానికి కుర్చీలు ఉంటాయి, కాని దళిత వర్గానికి చెందిన వాళ్లు పోతే కుర్చీలు ఉండవా అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగా ప్రశ్నించారు.
కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ..
శాలిగౌరారం ఎంపీడీవోపై మండల కార్యదర్శులంతా ఏకమై రెండు రోజుల క్రితం కలెక్టర్ బి. చంద్ర శేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఆమెపై విచారణ నిర్వహిస్తారా..? అనంతరం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయంగా ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. అయితే గతంలో ఆమె పనిచేసిన చోటకూడా గ్రామ కార్యదర్శులను వేదింపులకు గురిచేస్తే.. వారంతం అదే సమయంలో నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తును ఆందోళన చేశారు. ఓ కార్యదర్శి కూడా ఆత్మహత్మా యత్నం చేసినట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎంపీడీవో జ్యోతిలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల ఆరోపణలు నిరాధారం
నా పైన పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శులకు చెప్పాను. అవి చేయకుండా అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరం. టాక్స్ కలెక్షన్ చేసి, ట్రెజరీలో జమ చేయాలని, నిధులు నియమ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాలని, విధిగా సమయ పాలన పాటించాలని తెలిపినందుకు వారు నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను నా విధి నిర్వహణలో, ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాలు పాటిస్తాను. ఎవ్వరిని మానసిక వేదనకు గురి చేయలేదు. డబ్బులు తీసుకోలేదు. ఇలా ఆరోపణలు చేయడం తగదు.
జ్యోతి లక్ష్మి, ఎంపీడీఓ, శాలిగౌరారం






