ఆరు గ్యారంటీల అమలు లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..ఏమిరెడ్డి నర్సిరెడ్డి మాజీ డైరెక్టర్

by Bhanu |

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ ఏమిరెడ్డి నర్సిరెడ్డి విమర్శించారు.

ఆరు గ్యారంటీల అమలు లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..ఏమిరెడ్డి నర్సిరెడ్డి మాజీ డైరెక్టర్
X

దిశ, శాలిగౌరారం : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ ఏమిరెడ్డి నర్సిరెడ్డి విమర్శించారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 2024లో రెండు సీజన్ల రైతు భరోసా పథకం అమలులో అసమర్థత చూపించారని, రైతు ప్రక్షాళన పేరిట ఇచ్చే నిధులను సకాలంలో ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. 2025 యాసంగి సీజన్ ముగిసినప్పటికీ, మూడు ఎకరాల వరకు మాత్రమే రైతులకు రైతు భరోసా మంజూరు చేసి, మిగతా అర్హులైన రైతులకు నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు.

రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ, కొంతమందికి మాత్రమే మాఫీ చేసి "మాఫీ పూర్తయింది" అని చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని ఎద్దేవా చేశారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతినెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సర్వే పేరుతో కాలయాపన చేస్తూ పేదలకు అర్హతల పేరుతో అడ్డంకులు పెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు కేటాయించేలా చూస్తున్నారని ఆరోపించారు.

బహిష్టమైన వర్గాలపై ప్రభుత్వం తీరును విమర్శించిన నర్సిరెడ్డి, భువనగిరి ఎంపీగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి తరచూ కేసీఆర్‌ను దూషించడం తగదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు దేశంలో 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పాలించిందని, ఆ పరిపాలనలోనే అనేక స్కాంలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు వాటిని మర్చిపోయి ఇప్పుడు కేసీఆర్‌ను దోషిగా చూపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, ఆరు గ్యారంటీలు అమలులో విఫలమైనందుకే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్నదని ఆయన హెచ్చరించారు.





Next Story