ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి

by Nallavelli.Anjaneyulu |

నిత్యం ప్రజల మధ్యనే ప్రజాసేవసేవారిని ఎన్నికల్లో గెలిపించి ఆదరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.

ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి
X

దిశ, చండూరు : నిత్యం ప్రజల మధ్యనే ప్రజాసేవసేవారిని ఎన్నికల్లో గెలిపించి ఆదరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన చండూర్ లోని సీపీఐ కార్యాలయం మాధగోని నరసింహ భవనంలో మండల సీపీఐ కార్యవర్గ సమావేశం మండల పార్టీ సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చండూరు మున్సిపాలిటీ నాలుగో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి జెల్ల ధనమ్మ శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల కార్యదర్శి నలపరాజు, సతీష్ కుమార్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు తిప్పర్తి రాములు, మండల కార్యవర్గ సభ్యులు బరిగల వెంకటేష్, దోటి వెంకన్న, జిల్లా శ్రీను, సిహెచ్ ఉషయ్య, గంట రమేష్, ఇరిగి సంజీవ పాల్గొన్నారు.

Next Story