తిరుమలగిరి మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.

తిరుమలగిరి మున్సిపాలిటీలో  రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. సామాజిక న్యాయం, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తాజా కేటాయింపులతో మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

వార్డుల వారీగా రిజర్వేషన్లు

1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు బీసీ, 3వ వార్డు ఎస్సీ, 4వ వార్డు బీసీ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే 7వ వార్డు బీసీ, 8వ వార్డు జనరల్ మహిళ, 9వ వార్డు జనరల్గా నిర్ణయించారు. మిగతా వార్డుల్లో 10వ వార్డు ఎస్టీ, 11వ వార్డు జనరల్ మహిళ, 12వ వార్డు ఎస్సీ మహిళ, 13వ వార్డు జనరల్ మహిళ, 14వ వార్డు జనరల్, 15వ వార్డు ఎస్సీకి రిజర్వ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ రిజర్వేషన్ ఖరారవ్వడంతో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల మధ్య సమీకరణాలు,లోపాయికారీ చర్చలు ఊపందుకోగా…ఆయా వార్డుల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ రిజర్వేషన్ల నేపథ్యంలో తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story